
397views
“భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి. అది కూడా పాకిస్థాన్-బంగ్లాదేశ్ వెంబడే ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేస్తూ బిహార్ లోని ఛాప్రాలో ఉన్న జైప్రకాశ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖర్షీద్ అలామ్ అలియాస్ లాల్ బాబు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు రాసిన లేఖ తీవ్ర వివాదానికి దారితీసింది. భారతీయ ముస్లింలు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారంటూ లాల్ బాబు ఈ నెల 2న లేఖ రాశారు. అనంతరం దీనిని ఫేస్ బుక్ లోనూ ఆయన పోస్టు చేశారు దీనిపై ఏబీవీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. వివరణ ఇవ్వాలని లాల్ బాబుకు వర్సిటీ వర్గాలు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి.





