News

జైశ్రీరాం జెండాతో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌

387views

అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ సాహసం చేసింది. అయోధ్య మందిరం చిత్రం, జైశ్రీరామ్‌ అని నినాదం రాసి ఉన్న జెండాను పట్టుకొని బ్యాంకాక్‌లో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌ చేసింది. రాముడిపై భక్తిభావాన్ని ప్రదర్శించేందుకు ఈ పని చేసినట్లు వెల్లడించింది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జనవరి 22న జరగనుండగా అందుకు సరిగ్గా నెల రోజుల క్రితం(డిసెంబరు 22న) అనామిక ఈ సాహసం చేసింది . ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సాహసం చేసినట్లు అనామిక శర్మ తెలిపింది.