News

ఉగ్రవాద నిర్మూలనకే మా తొలి ప్రాదాన్యత – కేంద్ర క్యాబినెట్

544views

త కొన్ని సంవత్సరాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థ NIA పని తీరు ప్రభావవంతంగా కనిపిస్తోంది. తీవ్రవాదం, వేర్పాటు వాదాలను తుదముట్టించడంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు సైతం NIA సాయం అందిస్తోంది. NIA కు ఉపకారిగా వుండే విధంగా ఉగ్రవాద నిరోధక చట్టానికి మరింత పదును పెట్టె దిశగా కేంద్ర క్యాబినెట్ నేడు నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా నేడు పార్లమెంట్ లో బిల్లును కూడా ప్రవేశ పెట్టడం గమనార్హం.

UAPA చట్టంలోని 4వ షెడ్యూల్ లో చేసిన ఈ సవరణలతో NIA సైబర్ నేరాలను మరియు అక్రమ చొరబాట్లను కూడా నిరోధించగలగడం తోపాటు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోగలుగుతుంది.

ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం కేవలం పేరొందిన తీవ్రవాద సంస్థలపై మాత్రమే చర్యలు తీసుకునే వీలుంటుంది. ఉగ్రవాదులు విసురుతున్న తాజా సవాళ్ళను అధిగమించేందుకు NIA ను బలోపేతం చేసే ఈ చట్టాలు అవసరమని కేంద్ర హోం శాఖ 2017 నుంచే భావిస్తున్నట్లుగా ఒక ప్రకటనలో తెలిపారు.