
321views
గోవా లో పోర్చుగీసు పాలన అంతం కాలవాలని ఆ ప్రాంతాన్ని భారత దేశం లో విలీనం చెయ్యాలని 1955 లో ఆర్ ఎస్ ఎస్ కోరింది ఈ విషయం లో సైనిక బలగాలను ఉపయోగించడానికినెహ్రు నిరాకరించడం తో ఆర్.ఎస్.ఎస్, రాష్ట్ర సేవికా సమితి కి చెందిన కార్యకర్తలు జగన్నాథరావు జోషి తో పాటు 5 వేల మంది తో 1955 జూన్15 న సత్యాగ్రహం ప్రారంభించారు ఇందులో 3 వేల మంది మహిళలు కూడా పాల్గొన్నారు . 1955 ఆగస్ట్ 15 న పోలీసులు జరిపిన కాల్పులతో 50 మంది పౌరులు చనిపోయారు అనేకులు తుపాకి గుండ్ల దెబ్బలు తిన్నారు. అనేక మంది పోర్చుగీసు జైళ్ళలో అమానుష చిత్రహింసలను అనుభవించారు.





