
పాకిస్తాన్ హ్యాకర్లు వాట్సాప్ ద్వారా సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇండియన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మిలటరీ ఇంటలిజెన్స్ (MI)లు కూడా పలు హెచ్చరికలను జారీ చేశాయి. పాకిస్తాన్ స్పై హ్యాకర్లు ప్రముఖ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నారని వీటిల్లో రక్షణ దళాలు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ, పారా మిలటరీ దళాలు, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పోలీస్ ప్రముఖులు, మరియు పలు సంస్థల ప్రముఖ సైట్లను 2015 నుంచి 2018 మధ్య కాలంలో హ్యాక్ చేశారని తెలిపింది.
ఫేస్ బుక్ ద్వారా ‘సేజల్ కపూర్’ అనే నిక్ నేమ్ తో ‘విష్పర్’ మరియు ‘గ్రావిటీ ర్యాట్’ వంటి స్పై యాప్స్ ఉపయోగించి సమాచారాన్ని తస్కరిస్తున్నారని తెలిపింది. కాగా గతంలో ద ఎడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్‌కు చెందిన @adgpi అనే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తులు తమ వ్యక్తిగత వాట్సాప్ గ్రూప్ లలో చాట్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ ఆర్మీ పలు సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో కొన్ని రకాల సెక్యూరిటీ టిప్స్ ను సైనికులకు అలాగే దేశ పౌరులకు ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.
- గ్రూపులు రోజూ చెక్ చేయండి – వాట్సప్ గ్రూపులు ఉన్న వారు ప్రతి రోజూ చెక్ చేసుకోవాలని వీలైతే ఆడిట్ చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ తెలిపింది. కొత్త వారిని అలాగే unauthorized number గ్రూపుల్లో యాడ్ చేయవద్దని కోరింది.మీమీ గ్రూపులను తరచూ చెక్ చేస్తుండటంతో పాటు ఆడిట్లు నిర్వహిస్తుండండి. గుర్తుతెలియని నెంబర్ ఏదైనా యాడ్ అయినట్లయితే వెంటనే దానిని తొలగించండి లేదా మా దృష్టికి తీసుకురండి.
- పేర్లు సేవ్ చేయండి – గ్రూపుల్లో యాడ్ అయిన వారి పేర్లను కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసుకోవాలని కోరింది. కాంటాక్ట్స్ అన్ని పేర్లతో సేవ్ అయి ఉండాలి… గ్రూప్స్‌లోని అన్ని కాంటాక్ట్స్ పేర్లతో సేవ్ అయి ఉండేలా చూసుకోండి. మీ గ్రూప్స్‌లో యాడ్ అయ్యే కొత్త నెంబర్లను రెగ్యులర్‌గా పరిశీలిస్తుండండి.
- కొత్త నంబర్- కొత్త నంబర్ వస్తే దాని వివరాలను తెలుసుకున్న తరువాతే గ్రూపులో యాడ్ చేయాలని కోరింది.
- నంబర్ మారితే- మీ నంబర్ మారితే వెంటనే గ్రూపు అడ్మిన్ కు తెలపాలని తెలిపింది.
- పాత సిమ్ కార్డు – మీ నంబర్ మార్చినట్లయితే పాత నంబరు గల సిమ్ కార్డును పూర్తిగా ధ్వంసం చేయాలని తెలిపింది.
- పాత నంబర్లను డిలీట్ చేయండి – మీ పాత నంబర్లతో ఏ గ్రూపులోనైనా ఉంటే వెంటనే ఆ గ్రూపు నుండి బయటకు రావడం కాని లేకుంటే అకౌంట్ డిలీట్ చేయడం కాని చేయాలని తెలిపింది.
- +86తో మొదలయ్యే నెంబర్లతో జాగ్రత్త… +86తో మొదలయ్యే చైనీస్ నెంబర్లు ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ లోకి చేరి డేటాను దొంగిలిస్తున్నాయి. కాబట్టి ఈ నెంబర్ల పై ఓ కన్నేసి ఉంచండంటూ ఇండియన్ ఆర్మీ, సైన్యాన్ని హెచ్చరించింది.





