News

తాడేపల్లిలో శ్రీరాముని అక్షింతలు పంపిణీ

382views

అయోధ్య రామమందిరం నుండి తెచ్చిన శ్రీరాముని అక్షింతలను శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులక పేట చైతన్యతపోవన్ శివకేశవ ఆలయంలో మాత శివానంద సరస్వతి చేతుల మీదగా సుమారు 200 మంది భక్తులకు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివానంద సరస్వతి మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన అయోధ్య రామ మందిరం శ్రీరాముని అక్షంతలను కేశవాలయనికి రావడం జరిగిందని, ఈ అక్షంతలను సుమారు 200 మంది భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ అక్షింతలు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరేలా శ్రీరాముని ఆశీస్సులు ఉండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ నాయకులు నరసయ్య,శ్రీకాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అభియాన్ ప్రముఖ్ వెంకటేశ్వరరెడ్డి,బిజెపి తాడేపల్లి పట్టణ కన్వీనర్ టంకశాల ఈశ్వర్ నాయుడు, విభాగ్ వ్యవస్థ ప్రముఖ దివ్వెల కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.