
420views
అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్’గా మారుస్తోంది. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు సోషల్ మీడియా ద్వారా గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఏకరూపత, సమగ్రతను ప్రొత్సహించడానికి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు తెలిపారు.





