
240views
ప్రజా సౌకర్యమనే సాకుతో మూగ జంతువులను వధిం చకూడదని గుజరాత్ హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం పశు సంరక్షణాలయంలో పెట్టిన 30 గోవులను ఇటీవల వధించి, వాటి కళేబరాలను నడియాడ్ నగర పాలక సంస్థకు చెందిన బహిరంగ స్థలంలో పారేశారు. దానికి సంబంధించిన ఫొటోలను మౌలిక్ శ్రీమాలి అనే నగర పౌరుడు తన అఫిడవిట్లో హైకోర్టుకు సమ ర్పించారు. ఈ ఛాయాచిత్రాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయంటూ దీని మీద నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను కోర్టు ఆదేశించింది. ప్రజలకు ఇబ్బందిని తొలగించే పేరుతో ఒక్క అమాయక ప్రాణిని బలి చేయకూడదని, అలా చేస్తే భగవంతుడు మనల్ని క్షమించడని హైకోర్టు పేర్కొంది. వీధి పశువుల కోసం ఎన్ని పశు సంరక్షణాలయాలను ఏర్పాటు చేసింది, అక్కడ ఆ పశువులకు దాణా, నీరు పెడుతున్నారా? లేదా? అన్నది తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.



