News

యూఏఈలో ప్రారంభోత్సవానికి సిద్దమైన హిందూ దేవాలయం

282views

ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇప్పుడు సనాతన ధర్మ జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది. అబుదాబిలో నిర్మిస్తున్న భారీ హిందూ దేవాలయం నిర్మాణం దాదాపు సిద్ధమైంది. ఇది యూఏఈలోనే కాకుండా పశ్చిమాసియాలోనే మొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

రూ.700 కోట్లతో 108 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ ఆలయాన్ని రాబోయే 1000 సంవత్సరాల నిలిచే విధంగా నిర్మించారు. ఆలయ గోడలను గులాబీ ఇసుకరాయితో నిర్మించారు. ప్రస్తుతం ఆలయ చివరి దశ పనుల కోసం ,ఇంజనీర్లు, కార్మికులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 18 జరగనుంది. విశేషమేమిటంటే.. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోనే ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

గల్ఫ్ దేశంలో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణాన్ని ‘బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ’ నిర్మిస్తోంది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు, ఆ సమయంలో యూఏఈ అధ్యక్షుడు దుబాయ్-అబుదాబి మధ్య దారిలో ప్రధానికి బహుమతిగా ఇచ్చిన భూమిలో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.