News

శ్రీరామ జన్మభూమి పోరాట కథ నేటి, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: దత్తాత్రేయ హోసబాలే జీ

328views

శ్రీరాముడు వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలోని తన జన్మస్థలంలో నిర్మించిన తన అద్భుతమైన ఆలయానికి తిరిగి వస్తాడని, ఆపై 500 ఏళ్ల పోరాటం తర్వాత ప్రజల మనస్సులలో మరియు హృదయాల్లోకి తిరిగి వస్తాడని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. శ్రీరామ మందిర పునర్నిర్మాణం, చారిత్రాత్మక ప్రయాణం ప్రధాన అంశాలుగా హేమంత్ శర్మ రచించిన రామ్ ఫిర్ లౌటే(రాముడు తిరిగి వచ్చాడు) పుస్తకాన్ని స్వామి జ్ఞానానంద్ జీ మహారాజ్, జస్టిస్ హేమంత్ గుప్తా, విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ జీలతో కలిసి దత్తాత్రేయ హోసబాలే జీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోసబాలే జీ మాట్లాడుతూ, ‘‘ మత పునరుద్ధరణ కోసం ఎప్పుడూ పోరాటం జరుగుతోందని, కొన్నిసార్లు “సృష్టికి” ఇది అవసరం, ’’ అని అన్నారు. ‘శ్రీరామ జన్మభూమి’ కోసం 72 సార్లు పోరాటం చేశామని, ప్రతి తరం పోరాడిందని, కానీ ఎప్పటికీ వదులుకోలేదన్నారు.

అన్ని భాషల, వర్గాల ప్రజలు రామ జన్మభూమి పోరాటంలో పాల్గొన్నారని హోసబాలే జీ గుర్తు చేశారు. శ్రీ రామ జన్మభూమి చరిత్ర మరియు పోరాట కథను చాలా మంది రచయితలు రాశారని, అయితే విస్తృతమైన వాస్తవాలు, గణాంకాలు, పత్రాలు, ఉద్యమానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర రాయాల్సి ఉందని. అలాంటిదే రామ్ ఫిర్ లౌటే పుస్తకమని హోసబాలే జీ ప్రస్తుతించారు. ఇటువంటి రచనలు నేటి తరానికే కాకుండా రాబోయే తరానికి సైతం స్ఫూర్తిదాయకం అన్నారు. రాముడు మన స్ఫూర్తి, గుర్తింపు, ఆత్మగౌరవం అని స్వామి జ్ఞానానంద్ జీ మహారాజ్ తెలిపారు. ప్రజల వద్దకు రాముడు తిరిగి రావడంతో భారత్ మళ్లీ విశ్వ గురువుగా ఆవిర్భవించడం ఖాయమన్నారు. మన మధ్య బాబర్ వంటి శక్తులు నేటికీ ఉన్నాయని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విశిష్ట అతిథి జస్టిస్ హేమంత్ గుప్తా సూచించారు.

2024 జనవరి 22న 5 లక్షల మందిరాల్లో జరిగే కార్యక్రమాలకు లక్షలాది కుటుంబాలను ఆహ్వానించడం ద్వారా ‘కృణ్వంతో విశ్వమార్యం’(ప్రపంచంలో శుద్ధి, దయ, గౌరవాన్ని నిర్థారిద్దాం) అనే ప్రకటనను ప్రపంచవ్యాప్తంగా అర్థవంతంగా మారుస్తామని అలోక్ కుమార్ జీ విశ్వాసం వ్యక్తం చేశారు. అయోధ్య కేవలం ఒక నగరం కాదని ఇది భారతదేశం యొక్క ఆలోచన మరియు సాంస్కృతిక వారసత్వమని పుస్తక రచయిత హేమంత్ శర్మ స్పష్టం చేశారు.