News

అయోధ్య రామ మందిర పూజారిగా యూపీ విద్యార్థి

234views

అయోధ్య రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరగబోతోంది. ఇదిలా ఉంటే రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్‌కి చెందిన యువకుడు మోహిత్ పాండే ఎంపికయ్యారు.దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో ఏడేళ్ల చదివిన తర్వాత మోహిత్ పాండే తిరుపతి వెళ్లి వేద విద్యను అభ్యసించారు. ఇతరుల అర్చకులతో పాటు నియామకానికి ముందు ఆరు నెలల శిక్షణ తీసుకోనున్నారు.

సామవేదం చదువుకున్న మోహిత్ పాండే తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో చదివారు. ప్రస్తుతం ఆయన పీహెచ్డీకి సిద్ధమయ్యారు.మోహిత్ ఏడేళ్లుగా దూధేవ్వర్ వేద్ విద్యాపీఠంలో మతం, ఆచారాలపై అధ్యయనం చేశారు. 23 ఏళ్లుగా ఇక్కడ వేద బోధనను స్వీకరిస్తున్నారు. రామమందిరంలో పూజారిగా ఎంపిక కావడంతో నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు. స్థానికులు, బంధువుల నుంచి అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.