
యూపీలో మత మార్పిడి రాకెట్ గుట్టు రట్టు అయింది. స్వస్థత కూటముల పేరిట అమాయక వనవాసీలను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన ఓ ముఠా వనవాసీలను క్రైస్తవంలోకి మారుస్తోందని మలాహియా తోలా గ్రామానికి చెందిన నార్సింగ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా మత మార్పిడి రాకెట్ భాగోతం వెలుగు చూసింది.
ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 42 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి లాప్‌టాప్‌లు, క్రైస్తవ మత ప్రచార ప్రతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు వనవాసీలే లక్ష్యంగా స్వస్థత కూటములను ఏర్పాటు చేసి ప్రార్థనలతో రోగాలను నయం చేస్తామంటూ మత ప్రచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. డబ్బు ఆశ చూపి పేద వనవాసీలను చట్ట విరుద్ధంగా క్రైస్తవంలోకి మారుస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు.





