News

శ్రీమద్ భగవద్గీత భారతీయ ఆలోచనలకు పరాకాష్ట : డా. మోహన్ భగవత్

219views

భగవద్గీత భారతీయ ఆలోచన యొక్క అత్యున్నతను కలిగి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ ఉద్ఘాటించారు. ఒక నిమిషం – గీత పారాయణం ప్రపంచ ప్రచారం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మన పూర్వీకులు కూడా విశ్వాసం ఉంచండి అని ఎప్పుడూ చెప్పలేదని వాళ్లు మనకు పరీక్షించండి అనే చెప్పారని తెలిపారు. మాకు ఈ రీతిన అనుభూతి అయింది..మీరూ ఆచరించి చూడండి..అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అనే మన పూర్వీకులు చెప్పారన్నారు. పరీక్షించిన పిమ్మట విశ్వసించడం అనేది హిందూ మతం యొక్క ఆలోచనా విధానం అని పేర్కొన్నారు.

ఈ అత్యున్నత సత్యం వెలుగుచూసినప్పటికీ పదే పదేగా ప్రతి తరంలో మన పూర్వీకులు చెప్పిన మాటలు శల్య పరీక్షకు గురవుతూనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

నిరంతర సత్యాన్వేషణనే హిందుత్వం అంటారని గాంధీజీ అభివర్ణించారని… అయితే ఈ నిరంతర సత్యాన్వేషణ యొక్క అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అదే భగవద్గీత సారాంశమని వివరించారు. నిరంతర సత్యాన్వేషణ ఆలోచన జీవిత సంబంధితమైనది కావున భగవద్గీత మన జీవన ధర్మం. ఇందులో సందేహమే లేదని స్పష్టం చేశారు.