
190views
చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను కటాక్షించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణ రథంపై అధిష్ఠించి గణేశ నామస్మరణల నడుమ ఊరేగించారు. పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్‌రెడ్డి, కాణిపాకం సర్పంచి కె.శాంతిసాగర్‌రెడ్డి, మాజీ సర్పంచి కె.మధుసూధన్‌రావు, ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఉభయ దారులు, భక్తులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా సంకటహర గణపతి వ్రతం
ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించిన సామూహిక సంకటహర గణపతి వ్రతంలో భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.





