
316views
నేటి నుండి ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్ష ధారణ ప్రారంభమైంది. కాగా ఇంద్రకీలాద్రి పై ఈ రోజు ప్రారంభమైన భవాని మండల దీక్ష ఈనెల 27 వ తేదీ వరకు వరకు ఉంటుంది
అలానే అర్ధమండల దీక్షా ధారణ డిసెంబరు 13 వ తేదీ నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు ఉంటుంది. ఎవరైతే భవాని అర్ధమండల దీక్ష ధారణ చేపట్టాలి అనుకుంటున్నారో వారు డిసెంబరు 13 వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇక దీక్ష విరమణ విషయానికి వస్తే దీక్షను చేపట్టిన భక్తులు జనవరి 3వ తేదీ నుంచీ జనవరి 7 వ తేదీ వరకు దీక్షను విరమించుకోవచ్చు. కాగా విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి సన్నిధిలో నిర్వహించే కలశజ్యోతి నగరోత్సవం డిసెంబరు 26 వ తేదీ సాయంత్రం 06 గంటల నుంచీ ప్రారంభం అవుతుంది





