News

హర్యానాలోని నుహ్‌లో హిందువులపై మరో దాడి

280views

హర్యానాలోని నుహ్‌లో హిందువుల‌పై మ‌రోసారి దాడి జ‌రిగింది. మదర్సాకు చెందిన పిల్లలు రాళ్లతో దాడి చేయడంతో హిందూ భక్తులు, మహిళలు గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 8:20 గంటల సమయంలో ఒక మసీదు సమీపంలో ‘కువాన్ (బావి) పూజ’ కోసం కొంతమంది మహిళలు వెళ్తున్నారు. మదర్సా సమీపంలోకి రాగానే కొందరు మ‌దర్సాకు చెందిన చిన్నారులు హిందువుల‌పై వారిపై రాళ్లు రువ్వారు. కొద్దిసేపటికే ఇరు వర్గాల ప్రజలు అక్కడ గుమిగూడ‌డంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ప‌రిస్థితిని నియంత్రించారు. ఈ ఘ‌ట‌న‌లో పలువురు మహిళలు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం నుహ్ సీహెచ్‌సీలో చేర్చారు.

నుహ్ ఎస్పీ నరేంద్ర సింగ్ బిజర్నియా స్పందిస్తూ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నామని, మ‌దర్సా మౌల్వీని పిలిపించి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుంటామనిసరైన విచారణ జ‌రుపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఈ ఏడాదిలో హిందువుల‌పై దాడి జ‌ర‌గ‌డం ఇది రెండో సారి. అంతకుముందు, ఈ ఏడాది జూలై 31న విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన జలాభిషేక యాత్రలో నుహ్‌లో హింస చెలరేగింది. పక్కనే ఉన్న గురుగ్రామ్‌లోని మసీదుపై జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా, ఒక మత గురువు మరణించారు. నల్హర్ ఆలయంలో కనీసం 2,000 మంది మహిళలు, పిల్లలు ఆశ్రయం పొందారు.

ఈ హింసాకాండలో అనుమానితులలో ఒకరిగా ఉన్న ఫిరోజ్‌పూర్ జిర్కా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ఘర్షణలను ప్రేరేపించడంలో, త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం, ఇతరులను ప్రేరేపించడానికి సోషల్ మీడియా మాద్యామాల‌ను వినియోగిస్తునాడన్న‌ ఆరోపణపై అత‌న్ని సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత గత నెలలో రెండు కేసుల్లో బెయిల్ మంజూరైంది.