News

శబరిమలకు విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

352views

రైలు నంబరు 07121/07122 సికింద్రాబాద్‌-కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 19వ తేదీ సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.40కి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరిగి ఇదే బండి 21న కొల్లాంలో తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. జనగామ, ఖాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, కోయంబత్తూర్‌, పాల్కాడ్‌, త్రిశూర్‌, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుంది.

07119/07120 నర్సాపూర్‌-కొట్టాయం ప్రత్యేక రైలు 19న నర్సాపూర్‌లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 4.50కు కొట్టాయం చేరుకుంటుంది. తిరిగి 20వ తేదీ కొట్టాయంలో రాత్రి 7కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. పాలకొల్లు, భీమవరంటౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, త్రిశూర్‌, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగుతుంది.


ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే:

1. నవంబర్ 19న సికింద్రాబాద్ – కొల్లం ప్రత్యేక రైలు (07121)
2. నవంబర్ 19న నర్సాపూర్ – కొట్టాయం ప్రత్యేక రైలు (07119)
3. డిసెంబర్ 20న కొట్టాయం – నర్సాపూర్ ప్రత్యేక రైలు (07120)
4. డిసెంబర్ 21న కొల్లం – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07122)

ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఉపయోగించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాల భక్తులు.. సులభంగా, త్వరగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు వీలుకానుంది అని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.