
నూతన వధూవరుల కోసం టీటీడీ రోజుకు 20 టికెట్లను కేటాయించింది. టికెట్ ధరను రూ.1000 గా నిర్ణయించింది. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. పెళ్లైన కొత్త జంట ముందుగా సీఆర్‌వో కార్యాలయంలో ఆర్జిత సేవా లక్కీ దిప్ కౌంటర్‌కి వెళితే చాలు. ఫోటో ఫ్రూఫ్ కింద వధూవరుల పెళ్లి నాటి ఫోటో తప్పని సరి.
ఇక లిఖిత పూర్వక ఫ్రూఫ్ కింద వెడ్డింగ్‌కార్డు, ఆధార్ కార్డ్ తప్పనిసరి. పెళ్లయిన వారం రోజుల లోపే ఉండాలి. ఈ ప్రాసెస్ ద్వారా నూతన వధూవరులు నేరుగా కల్యాణోత్సవ టికెట్ పొందవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద జారీ చేయబడిన 100 కల్యాణోత్సవం టిక్కెట్లలో 20 ఇక నుండి నూతన వధూవరులకు కేటాయించారు. ఏదైనా నిర్దిష్ట రోజున టిక్కెట్‌ను బుక్ చేసుకున్న జంటల సంఖ్య కోటాను మించకపోతే, మిగిలిన టిక్కెట్లు ఇతర యాత్రికులకు సాధారణ కోటా కింద జారీ చేస్తారు.





