
జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణప్రతిష్టలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శైవ పీఠం శివస్వామి, మాత శివ చైత్యానంద పిలుపునిచ్చారు. ముత్యాలంపాడు కోదండ రామాలయంలో గురువారం అయోధ్య శ్రీరాముని పవిత్ర అక్షింతలు స్పర్శ కార్యక్రమం జరిగింది. శివస్వామి, మాత శివ చైత్యానంద ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ అందజేసేందుకు ఇక్కడకు చేరుకున్నాయన్నారు. ఇక్కడ నుంచి అన్ని జిల్లాలకు అక్షింతలను పంపిస్తామన్నారు.
‘అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు’

ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్- వీహెచ్‌పీ కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోక రాజు గంగరాజు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రచారక్ ఆదిత్య, కోనేరు దుర్గాప్రసాద్, నరసయ్య పాల్గొని మాట్లాడారు. ప్రాంత కార్యదర్శి తనికెళ్ల రవి, కోశాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.





