News

భారతీయులకు మరణశిక్షను సవాల్‌ చేస్తూ కతార్‌ కోర్టులో అప్పీలు దాఖలు

440views

గూఢచర్యం కేసులో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్షను సవాల్‌ చేస్తూ కతార్‌ కోర్టులో అప్పీలు దాఖలు చేశామని, దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. మరోవైపున ఇదే విషయమై కతార్‌ ప్రభుత్వంతో దౌత్యపరమైన సంప్రదింపులూ కొనసాగుతున్నాయని గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులకు తెలిపారు.