News

శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం లో పాల్గొనాలంటే..ఇలా..!!

257views

టీటీడీలో పని చేసే ఉద్యోగులకు పాలక మండలి శుభ వార్త చెప్పింది. తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల‌ రెగ్యుల‌రైజేషన్ పైన చర్చ చేసారు. అదే విధంగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థ‌లాలపైన సమీక్షించారు. ఈ నెల 23న అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం టికెట్ ధరను రూ 1000గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు.

పలు కీలక నిర్ణయాలు:

టీటీడీ భక్తుల కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో ప్రారంభం కానుంది. మొద‌ట కొద్దిమందితో ప్రారంభించి ఆ త‌రువాత విస్తృత స్థాయిలో స్లాట్ల విధానంలో నిర్వ‌హిస్తారు. ఇందుకోసం టికెట్ ధ‌ర రూ.1000/-గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు.