
357views
జగన్మాత దుర్గమ్మను గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. 5 లక్షల గాజులను దాతలు విరాళంగా ఇచ్చారు. మల్లికార్జున మహామండపంలో సేవా సిబ్బంది మూడు రోజులుగా వాటిని దండలుగా తయారు చేశారు. ఈ రోజు రంగు రంగుల గాజులతో వెలుగులు ప్రసాదించే దుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంటారు. ప్రతీఏడు మాదిరిగానే ఈసారి కూడా గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి మూల విరాట్‌తో పాటు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో ఆలయ అధికారులు అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
