
అస్సాం రాష్ట్రం గువహటిలో దారుణం జరిగింది.రతాబరి ప్రాంతంలో శివ-పార్వతి, లక్ష్మీనారాయణ ఆలయాలకు ఇస్లామిస్టు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఆలయాలు దగ్ధమయ్యాయి. ముస్లిం మత ఛాందసవాదుల దుశ్చర్యతో స్థానిక హిందూ గిరిజన ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలకు నిప్పు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఘటనను స్థానిక హిందూ గిరిజనులు తీవ్రంగా ఖండించారు.
ఈ ఆలయాన్ని 1800వ దశకంలో గిరిజన గ్రామం సమీపంలో దేవి రామ్ బర్మన్ అనే వ్యక్తి స్థాపించాడని స్థానికులు తెలిపారు.అయితే ఇటీవలి కాలంలో ఇస్లామిస్టులు అటవీ భూమిని ఆక్రమించుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆక్రమించుకున్న అటవీ ప్రాంతాలను వదిలి వెళ్లమని కోరడంతోనే ఆలయాలకు నిప్పు పెట్టారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సంఘటనా స్థలికి చేరి పరిశీలించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని, అలాగే ఆక్రమణదారులను అక్కడ నుంచి పంపించి వేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆలయాలకు నిప్పు పెట్టడం తమ సనాతన ధర్మంపై, విశ్వాసాలపై దాడిగా గిరిజనులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Source : Organiser.org





