
341views
ఒమన్‌లోని మస్కట్ లో ఓ పాఠశాలకు చెందిన భారత సంతతి విద్యార్ధులు ‘సారే జహాన్ సే అచ్ఛా’ గీతాన్ని సంస్కృతంలో ఆలపించారు. భారత స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత సంతతికి చెందిన చిన్నారులు ఈ గీతాన్ని పాడగా.. సంపూర్ణ విశ్వ రత్నం అంటూ సాగే ఈ గీతం ‘సారే జహాన్ సే అచ్ఛా’ కు సంస్కృత రూపంగా చెబుతున్నారు. సంస్కృతంలో ఆలపించిన ఈ గీతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.





