News

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై కేసు నమోదు

738views

హిందూ దేవుళ్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూనివర్శిటీ ఆఫ్ అలహాబాద్‌లోని పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్, బజరంగ్ దళ్ సంస్థలు సంయుక్తంగా ఫిర్యాదు చేయడంతో అలహాబాద్ నగరంలోని కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు నమోదు చేశారు.యూనివర్శిటీ చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ విక్రమ్ హరిజన్, X (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో… విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జిల్లా కన్వీనర్ శుభం ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ప్రొఫెసర్‌పై IPCలోని సెక్షన్‌లు 153-A (మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295-A (మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేయడం) మరియు సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. X లో ప్రొఫెసర్‌ చేసిన పోస్ట్‌లో, IPC సెక్షన్ 302 కింద రాముడిని జైలులో పెట్టాలని సూచించడంతో పాటు శ్రీకృష్ణుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వ్యాఖ్యలు చేశారు.ప్రొఫెసర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

“విక్రమ్ హరిజన్ వంటి వ్యక్తులు సామాజిక అశాంతిని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారని… దేశ భద్రత మరియు ప్రజా శాంతికి హాని కలిగించే వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగం అనుమతించదని వారికి తెలియదని ” అని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన శుభం పేర్కొన్నారు.

Source : ABP live