
306views
శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అందించే అవార్డులకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అశోక్ గాడ్గిల్, శుభ్ర సురేశ్‌కు నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ మెడల్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం అందజేశారు.
అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం బర్కెలీ యూనివర్సిటీలో ఎమిరెట్స్ ప్రోఫెసర్‌గా సివిల్, ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తుండగా.. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో శుభ్ర సురేశ్ విధులు నిర్వర్తిస్తున్నారు.




