News

తుది అంకానికి బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మాండనాయకుడికి వైభవంగా చక్రస్నానం

288views

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. దీనిలో భాగంగా చివరి రోజున పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. చక్రస్నానం తర్వాత ఆనంద నిలయానికి స్వామివారిని చేర్చారు. అనంతరం భక్తులు కూడా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3-6 గంటల సమయంలో వేంకటేశుడికి పల్లకీ, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.