News

ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

284views

ఆంధ్రప్రదేశ్ లో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు. గతంలో దసరాను ఐచ్ఛిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి స్వల్ప మార్పులతో సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు మరో ఉత్తర్వులను విడుదల చేశారు.

కాగా,ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది