News

దసరా రద్దీని దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు : దక్షిణమధ్య రైల్వే

245views

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07270) ప్రత్యేక రైలు ఈ నెల 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 4.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–తిరుపతి (07041/07042) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20వ తేదీ సాయంత్రం 7.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–కాకినాడ (07271/07272) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 21వ తేదీ రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–కాకినాడ (07065/07066) స్పెషల్‌ ట్రైన్‌ 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 24వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.