News

ఆది కైలాస శిఖరం ఎదుట ప్రధాని మోదీ ధ్యానం

447views

ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిథోర్‌గఢ్‌లోని ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. అక్కడి మహాశివుడి ఆలయంతోపాటు పార్వతీకుండ్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.

ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా మోదీ పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. ఇందులో భాగంగా పార్వతీకుండ్‌ ఒడ్డున ఉన్న శివపార్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శంఖాన్ని పూరించారు. తలపాగా, రంగా (పై వస్త్రం)తో కూడిన సంప్రదాయ గిరిజన వస్త్రధారణతో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆది కైలాస పర్వత శిఖరానికి అభిముఖంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు.