
279views
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి జరిగే దసరా ఉత్సవాలకు రోజుకు లక్షా 70వేల మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.ప్రతి సెకనుకు ఇద్దరు – ముగ్గురు భక్తులు దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.రోజుకు నాలుగు గంటలు పూజలు, నివేదనలు, ఇరవై గంటలు భక్తుల దర్శనాలు ఉంటాయని.. ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రోటోకాల్ ఉన్న వారు స్వయంగా వస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.




