
416views
నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సింఘానియా గ్రూప్ ముందుకొచ్చింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ గౌతమ్‌హరి సింఘానియా సమక్షంలో మంగళవారం ఈ మేరకు ఒప్పందం జరిగింది. ముంబైలోని ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో 70 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని సింఘానియా చేపడతారని తితిదే ఈవో తెలిపారు. నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు.




