News

కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేతల భేటీ

366views

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ జీ, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే జీ సహా పలువురు అగ్రనేతలు కేరళ రాజధాని తిరువనంతపురంలో సమావేశమయ్యారు. రెండు రోజులపాటు జరిగిన ఈ బైఠక్‌ (సమావేశం) సోమవారం మొదలైంది. ‘‘సాధారణంగా ప్రతి రెండు జాతీయ కార్యనిర్వాహక సమావేశాల మధ్య జరిగే పరిణామాలను ఇటువంటి బైఠక్‌లలో చర్చిస్తూ ఉంటాం. తిరువనంతపురం సమావేశానికి ఆరెస్సెస్‌ అగ్రనేతలు 10 మంది హాజరయ్యారు’’ అని నిర్వాహకులు తెలిపారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అక్టోబరు 7 నుంచి కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న కారణంగా ఈ సారి సమావేశం ఇక్కడ జరిగింది. కోజికోడ్‌లో కేసరి వీక్లీ ఏర్పాటుచేసిన ‘అమృతశతం ఉపన్యాస ధార’కు, కొల్లంలో సంఘ్‌చాలక్‌ల రాష్ట్ర సమావేశానికి మోహన్‌ భాగవత్‌ జీ హాజరయ్యారు. కోజికోడ్‌లో ఆయన మాట్లాడుతూ.. మనలో ఎంత భిన్నత్వం ఉన్నా, అందరి డీఎన్‌ఏ ఒక్కటే అన్నారు. మంగళవారం ప్రఖ్యాత శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.