
249views
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. నాగపూర్‌లోని రేషిమ్‌బాగ్‌లో అక్టోబర్ 24 నిర్వహించే బహిరంగ సాంస్కృతిక కార్యక్రమంలో శంకర్ మహదేవన్ పాల్గొంటారు. ఈ వేడుకలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ జీ సమక్షంలో నిర్వహించనున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను డా. కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో విజయదశమి పర్వదినాన మహారాష్ట్రలోని నాగపూర్‌లో స్థాపించారు. విజయదశమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేడుకలను నిర్వహిస్తోంది. గత ఏడాది ప్రముఖ పర్వతారోహకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంతోష్ యాదవ్ నాగపూర్ విజయదశమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.





