News

కాణిపాకంలో పున్నమి గరుడ సేవ

163views

చిత్తూరు జిల్లాలోని కానిపాకంలో గురువారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి స్వామిని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తుల చేత వ్రతాన్ని చేయించారు. రాత్రి శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి కాణిపాక పురవీధులలో ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.