
205views
తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. వేడుకగా ఆస్థానం నిర్వహించారు. మఽధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీభూ సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.





