News

పుల్వామా దాడులతో సంబంధమున్నమరో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

626views

పుల్వామా ఉగ్రదాడితో సహా అవంతిపురా తదితర ప్రదేశాలలో జరిగిన పలు పేలుళ్లతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏప్రిల్ 29 సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఎస్పీ తాహిర్ సలీం ఖాన్  తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురిని ముర్తజా, ఆకిబ్, ఇర్ఫాన్ ఉల్ హక్ లుగా గుర్తించారు. నాలుగో ఉగ్రవాది పేరును రహస్యంగా ఉంచారు.

అరెస్టయిన ఉగ్రవాది ముర్తజా వద్ద నుంచి ఒక చైనీస్ పిస్టల్ను, రెండు మ్యాగజైన్లను, మరో ఎనిమిది రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముర్తాజా, ఆకిబ్ల జంట జైషే మొహమ్మద్ కు కావలసిన రవాణా, ఇతర సౌకర్యాల ఏర్పాటు చేసేందుకు పని చేస్తున్నారని తెలిపారు. వీరు కాక ఆదివారం నాడు శ్రినగార్లోని పోలీస్ పోస్టుపై దాడికి పాల్పడిన మరో ముగ్గురు ఉగ్రవాదులను కూడా నిర్బంధంలోనికి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా అరెస్టయిన ఆ ముగ్గురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.