News

హరిద్వార్ లో రష్యన్ల పూజలు.. యుద్ధం ఆగిపోవాలంటూ గంగా నదికి ప్రార్థనలు

357views

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుతూ.. రష్యాకు చెందిన పలువురు హరిద్వార్ లో పూజలు చేశారు. రష్యా నుంచి భారత్‌కు వచ్చిన 24 మంది రష్యన్ల బృందం హరిద్వార్ చేరుకుని కంఖాల్‌లోని రాజ్‌ఘాట్‌లో గంగాపూజ నిర్వహించారు. హిందూ ఆచారాల ప్రకారం గంగను పూజించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు. వీరు గత కొద్ది రోజులుగా హరిద్వార్, రిషికేశ్‌లలో నివసిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగి ఏడాది కావస్తున్నా ఇంకా యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు కాబట్టి రెండు దేశాల పౌరులు కూడా యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పేందుకు తమ స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించే 24 మంది రష్యా నుండి హరిద్వార్ చేరుకున్నారు. వారికి పవిత్ర గంగానదిపై అచంచల విశ్వాసం ఉంది. దీంతో తమ కోరికలు ఫలించాలని కోరుకుంటూ పూజలు చేశారని బృందం నాయకుడు ఒకరు తెలిపారు.