
హిందూ గ్రంధాలు, ధర్మాల ప్రకారం.. మంచం మీద కూర్చొని ఆహారం తినే వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండదని చెబుతుంటారు. వాస్తవానికి ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోలేదు. ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు, కొన్ని ప్రధాన స్థలాలు రూపొందించబడ్డాయి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని నమ్ముతారు. తినడానికి ఉత్తమమైన ప్రదేశం వంటగది అని అంటుంటారు. లేదా ఇంట్లోనే నేలపై కూర్చొని ఆహారాన్ని తినవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి… ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మంచి ప్రదేశంలో కూర్చొని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని భావిస్తారు. వంటగదిలో కూర్చొని భోజనం చేయడం కూడా రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. జ్యోతిష్యం మరియు శాస్త్రాల ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చొని తింటే మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లే అని చెబుతుంటారు. అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవపరచడం లాంటిదని అంటారు. తినడం అనేది బృహస్పతి మరియు రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు, కాబట్టి దానిని సంతోషపెట్టడానికి ఎల్లప్పుడూ మార్గాలు కనుగొనబడతాయి. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు.
ఇతర కారణాలు ఇలా..
అలసట కారణంగా మనం తరచుగా మంచం మీద కూర్చొని తింటుంటాం.. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బెడ్-సిట్టింగ్‌తో మనం ఆహారం మీద దృష్టి పెట్టలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా సార్లు మనం బెడ్‌పై భోజనం చేస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తూ తింటున్నప్పుడు.. మన దృష్టి పూర్తిగా తినడంపై ఉండదు.. దీంతో అతిగా తినడం, లేదా సరిగ్గా కడుపు నిండా తినలేం. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం యొక్క భంగిమ కూడా సరిగా ఉండదు.. దీంతో ఆహారం జీర్ణం కావడం కష్టం అవుతుంది. మంచం మీద భోజనం చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది… బెడ్‌పై కొన్ని ఆహార పదార్థాలు ఉండటం వల్ల నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే దాని వల్ల క్రిములు వచ్చి.. చర్మ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి.





