News

‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ను అడ్డుకున్న ముస్లిములు – “మా దేవుళ్లంటే అంత చిన్న చూపా?” అంటూ మండిపడుతున్న హిందువులు.

1.3kviews

సైరా నరసింహా రెడ్డి.. బ్రిటీషర్లను ఊచకోత కోసిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యపాత్రలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. పలు దేశాల్లో షూటింగ్ పూర్తీ చేసుకొని వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్ లో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి అనుకోకుండా ఇబ్బందులు తలెత్తాయి. ఆ సినిమా షూటింగ్ జరగకుండా కొందరు ముస్లిం యువకులు అడ్డుకున్నారు.

బహమనీ కోటలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా.. కోటలోని ముస్లిం ప్రార్థనా స్థలంలో షూటింగ్ జరుగుతోందని, ఆ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలను ఉంచరాదని గుంపుగా వచ్చిన ముస్లిం యువకులు అడ్డుకున్నారు. హిందూ విగ్రహాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బీదర్ కోటలో ఓ పత్యేక సెట్ వేయగా..  ఈ సెట్ లో హిందూ విగ్రహాలను ఉంచారు. షూటింగ్ కు పురాతత్వ శాఖ అనుమతి తీసుకున్నా.. ముస్లిం యువకులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి హిందూ విగ్రహాలను, సెట్ ను తొలగించారు. దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్ర దర్శకుడితో పాటు, కన్నడ నటుడు సుదీప్ పై కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు.

హిందువుల ఆగ్రహం :

అయితే ఈ ఘటనపై హిందువుల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డమ్మీ విగ్రహాలు వాడితేనే ఇంత హడావుడెండుకని ప్రశ్నిస్తున్నారు. లౌకిక దేశంలో సోదరులుగా కలసి జీవించవలసిన హిందూ ముస్లిముల మధ్య ఇలాంటి సంఘటనలు మంచిది కాదంటున్నారు. హిందూ దేవుళ్ళ విగ్రహాలు అక్కడ పెడితే ఆ స్థలం అపవిత్రమైపోతుందా? ఇది ముస్లిముల పరమత అసహనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మా దేవుళ్లంటే అంత చిన్న చూపా? అని మండిపడుతున్నారు. పోలీసుల తీరుపైనా హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వంలో హిందువులకు గౌరవము, రక్షణ కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.