
476views
ముంబై: దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో మహ్మద్ నవాబ్ మహ్మద్ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్ సంస్థ, మాలిక్ ఇన్‌ఫ్రా సంస్థల ఆస్తులను పీఎంఎల్ చట్టం కింద అటాచ్ చేశామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబైలోని గోవావాలా కాంపౌండ్, వాణిజ్య సముదాయం, మూడు ఫ్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, ఒస్మానాబాద్ జిల్లాలోని 147.79 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్టు పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ఈడీ ఫిబ్రవరిలో అరెస్టు చేసింది.
Source: Nijamtoday





