News

శ్రీశైలం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఘనంగా శివాజీ జయంతి కార్యక్రమం

734views

ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ అఖిలభారత కార్యదర్శి శ్రీ సత్య కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య మాట్లాడుతూ చత్రపతి శివాజీ దేశభక్తి, ధర్మ నిష్ఠ, దీక్ష, పట్టుదల, వ్యూహ చతురత తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

తిరుపతికి చెందిన నాట్యాచార్యులు శ్రీ శరత్ చంద్ర (అఖిలభారతీయ విద్యార్థి పరిషత్) తన బృందంతో ప్రదర్శించిన శివునికి సంబంధించిన నాట్య ప్రదర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులందరినీ ఎంతో అలరించాయి. అనంతరం నాట్య ప్రదర్శనలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం సంఘటనా కార్యదర్శి శ్రీ సోమయాజుల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ఆద్యంతము చాలా చక్కగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో శ్రీ సత్య కుమార్, శ్రీ ఆదిత్య లు స్ఫూర్తి కేంద్రంలోని చత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.