News

గుంటూరులో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు

464views

గుంటూరులోని బంజర నాయక కాలనీలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగినది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి శ్రీ మాగంటి సుధాకర్ యదవ్ , శ్రీ చంద్ర నాయక్ , ధార్మిక మండలి సభ్యులు శ్రీ నరేంద్ర గౌతం , గోశాల సభ్యులు శ్రీ రామకృష్ణ , దుర్గా మాత మందిర్ అద్యక్షులు శ్రీ తావులాల్, మరికొందరు గుంటురు జిల్లా బంజారా ప్రముఖులు పాల్గొన్నారు . సేవాలాల్ మహరాజ్ దుర్గామాత భక్తులని, గోసంపదని, హిందూ థర్మాన్ని, బంజారాలను కాపాడిన మహానుభావుడని నరేంద్ర గౌతం తెలిపారు . సంత్ సేవాలాల్ జయంతి సందర్బంగా 200 మందికి అన్నప్రసాద వితరణ జరిగినది .

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.