News

విగ్రహాల విధ్వంసకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి – పెజావర్ పీఠాధిపతి

592views

ర్ణాటకలోని సుప్రసిద్ధ పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి వారు ఈరోజు విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండ పైనున్న రామాలయాన్ని సందర్శించారు. తర్వాత రామతీర్థంలోని శివాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రామతీర్థంలోని రామమందిరంలో జరిగిన దుర్ఘటన మరియు గత సంవత్సరం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని హిందువులకు, హిందూ దేవాలయాలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఆ మేరకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్షాకి తాము వ్రాసిన లేఖను పత్రికా ముఖంగా ప్రదర్శించారు.

దేవాలయ పరిసరాలను పరిశీలిస్తున్న స్వామీజీ

పోలీసు అధికారుల నుంచి వివరాలడిగి తెలుసుకుంటున్న దృశ్యం

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న స్వామీజీ

పెజావర్ పీఠాధిపతి అమిత్ షా కు పంపిన లేఖ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.