NewsProgramms

నంద్యాల సంఘ మిత్రసేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

112views

ర్నూలు జిల్లా నంద్యాల సంఘ మిత్రసేవా సమితి ఆధ్వర్యంలో, ఈ రోజు సంఘమిత్ర ప్రాంగణంలో పేద కుటుంబాలకు ఉపాధి సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.

ఈ సందర్భంగా సంఘ మిత్రా సేవా సమితి అధ్యక్షుడు శ్రీ. కె. నాగ సుబ్బారెడ్డి, ప్రస్తుత సమయంలో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, ఈ గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి ఆర్థిక సహాయం అందించగల వధాన్యుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుట్టు మిషన్లను అంద చేసినందుకు శ్రీ వై.వెంకటరెడ్డి గారిని అభినందించారు.

శ్రీ వై. వెంకటరెడ్డిగారు మాట్లాడుతూ తోటి జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలని చెప్పే స్వామి వివేకానంద గారి కథతో తాను ప్రేరణ పొందానని దాత శ్రీ వై వెంకట రెడ్డి తెలిపారు. నిరుపేద కుటుంబ జీవితాన్ని సుస్థిరంగా మార్చడానికి చేసిన చిన్న సహకారం చాలా సంతృప్తికరంగా మరియు ప్రోత్సాహకరంగా ఉందని, ఈ సహాయాన్ని సమర్థ వంతంగా ఉపయోగించుకొని విజయవంతమైన జీవితాన్ని గడపాలని, సహాయం పొందిన వారిని కోరారు.

సంఘమిత్ర సేవా సమితి చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ సమితి కార్యదర్శి శ్రీ చిలుకూర్ శ్రీనివాస్, నిరాశ్రిత బాలుర ఆవాసం, విద్యార్థుల ఆవాసం, 40 చెంచు నివాసాలకు మొబైల్ల్ డిస్పెన్సరీ, వారికి దుస్తులు మరియు ఇతర అవసరాలను అందించడం, వైద్య శిబిరాలు నడపడం, మురికివాడలలో ఉచిత ట్యూషన్లు (అభ్యాసికలు) వంటి వివిధ సేవా ప్రాజెక్టులను వివరించారు.

దాతలు తమ ఔదార్యం తో ముందుకు రావాలని, పేదలకు సహాయం చేయడానికి మరికొన్ని సేవా ప్రాజెక్టులను చేపట్టడానికి సమితి సిద్ధంగా ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సంఘ్ చాలక్ డాక్టర్ ఉదయ శంకర్, డాక్టర్ సత్య శివ సుందరి, సంఘ మిత్ర కోశాధికారి శ్రీ. సముద్రాల నాగరాజయ్య , ధర్మజగరన జిల్లా ప్రముఖ్ శ్రీ రామ్ ప్రసాద్ తదితరులు కార్య కర్తలు సదరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

లబ్దిదారులు శ్రీమతి ఇప్పా అన్నపూర్ణ, శ్రీమతి మట్టి మహాలక్ష్మి, శ్రీమతి ఇండ్ల ఉషారాణి దాతకు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు వారు అందుకున్న ఈ గొప్ప సహాయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడం ద్వారా వారి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటామని హామీ ఇచ్చారు.
చివరగా, శ్రీ చిలుకూర్ శ్రీనివాస్ గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం సుసంపన్పమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.