News

వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ

681views

ర్నూలు జిల్లా, నంద్యాల వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పేద చిరు వ్యాపారులకు ఉపాధి సహకారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంఘమిత్ర ఆవరణలో తోపుడు బండ్లు అందించే కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షులు డాక్టర్ ఉదయ శంకర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆర్థిక సహకారం అందించే వదాన్యుల సంఖ్య కూడా పెరగ వలసిన అవసరం ఉందని తెలియజేశారు. తోపుడుబండ్లను బహూకరించిన శ్రీ వై వెంకటరెడ్డి గారిని అభినందించారు.

దాత శ్రీ వై వెంకట రెడ్డి గారు మాట్లాడుతూ, జీవితం సఫలం చేసుకోవడానికి చేసే చిన్న సహకారమైనా ఎంతో తృప్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని, సహాయం పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సమితి సహకార్యదర్శి శ్రీ మనోహర్, సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ నాగ సుబ్బారెడ్డి, కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్, ధర్మ జాగరణ ప్రముఖు శ్రీ రామ్ ప్రసాద్, శ్రీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సహకారం పొందిన శ్రీ నాగేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరిగా శ్రీ చిలుకూరు శ్రీనివాస్ గారి వందన సమర్పణతో కార్యక్రమం సంపన్నమయ్యింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.