News

చెప్పేది బైబిల్ ప్రబోధం – చూపేది కామ ప్రకోపం

1.2kviews

ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చూసినా క్రైస్తవ మత ప్రచారకుల కామ పైత్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక దేశాల్లో అలాగే మన దేశంలోని అనేక రాష్ట్రాలలోని చర్చిలలో, క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వివిధ వసతి గృహాలు, హాస్పిటల్స్ తదితర ప్రాంతాలలో అమాయక మహిళలపైన, బాలికలపైన క్రైస్తవ పాస్టర్లు, ఫాదరీలు లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం బయటపడుతూ ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోని డాన్ బాస్కో యూత్ సెంటర్లోని క్రిస్టియన్ ఫాదర్ మరియు చైల్డ్ లైన్ డైరెక్టర్ అయిన మిస్టర్ సిరియాక్ డాన్ బాస్కో యూత్ సెంటర్లోని చిన్నారులకు స్వచ్చందంగా సేవలు అందిస్తున్న ఓ గిరిజన వైద్య విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోని డాన్ బాస్కో యూత్ సెంటర్ అనాథ బాల బాలికలకు వసతి, భోజన సౌకర్యాల తోపాటు విద్య, వైద్యాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. సహజంగా సేవా కార్యక్రమాలపై ఆసక్తి కలిగిన ఒక గిరిజన వైద్య విద్యార్థిని ఆ సంస్థ చేపడుతున్న సేవా కార్యకరమాలకు ఆకర్షితురాలై ఆ డాన్ బాస్కో యూత్ సెంటర్లోని చిన్నారులకు తన వంతు సేవలందించడానికి వెళుతూ ఉండేది. అయితే అందరికీ బైబిల్ సూక్తులు వినిపించే అక్కడి క్రిస్టియన్ ఫాదర్ మరియు చైల్డ్ లైన్ డైరెక్టర్ అయిన సిరియాక్ కు బుద్ధి వక్రించి ఆ యువతిపై కన్నేశాడు. అప్పటి నుంచి మెల్లగా ఆ యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. తన కోర్కె తీర్చమంటూ ఆమెను తరచూ వేధించసాగాడు.

ఎంతో గొప్ప సంకల్పంతో, ఆ సంస్థ గురించి ఎంతో గొప్పగా ఊహించుకుని ఆ సంస్థలో సేవలందిద్దామనే సదాశయంతో అక్కడికి వచ్చిన ఆ యువతి అందరినీ సన్మార్గంలో నడిపిస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ఆ ఫాదరు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు హతాశురాలయ్యింది. తన పట్ల జరుగుతున్న ఘోరాన్ని జీర్ణించుకోలేకపోయింది. సదరు ఫాదరుపై పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మొర ఆలకించలేదు. ఆమె నుంచి ఫిర్యాదును స్వీకరించలేదు.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ యువతి తన దీన గాధను వివరిస్తూ హైదరాబాదులోని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారికి మెయిల్ చేసింది. వెంటనే స్పందించిన లీగల రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు ఆ యువతికి జరిగిన ఘోర అవమానాన్ని జాతీయ మహిళా కమిషన్ కు నివేదించటం జరిగింది. మహిళాకమీషన్ వెంటనే స్పందించి నిందితుడిపై వెంటనే FIR ఫైలు చేసి జరిగిన ఘటనపై తమకు నివేదిక సమర్పించాల్సిందిగా కోరుతూ ఇటానగర్ జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై SC, ST యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.