News

కదిలించిన కాషాయం

548views

క చిన్న కాషాయ జండా. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. అధికారులను రప్పించింది. వారికి ముచ్చెమటలు పట్టించింది. చివరకు విజయం సాధించి పెట్టింది.

వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా వి. కోట మండలం పాపేపల్లె గ్రామ సమీపంలో హైవే విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా దశాబ్దాలుగా వాడుకలో ఉన్న ఆ గ్రామ శ్మశానం రోడ్డు విస్తరణ తో కనుమరుగై పోయింది. గత కొంత కాలంగా వారు తమ గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని శ్మశానం కొరకు కేటాయించమని ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది.గత వారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో గత్యంతరం లేక పాత శ్మశానానికి దగ్గరున్న ప్రభుత్వ భూమిలో ఖననం చేశారు.

 

ఇలా ఉండగా ఆ స్థలాన్ని ప్రభుత్వం మైనారిటీ గురుకుల పాఠశాల హాస్టలుకు కేటాయించిందని, వెంటనే ఖాళీ చేయించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రెవిన్యూ అధికారులు బోర్డు పెట్టారు.

గ్రామంలోని కొందరు యువకులు గ్రామస్తులందరినీ సంఘటిత పరచి సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్థులందరూ ఏకతాటిపై నిలిచి ఆ స్థలంలో నాలుగు వైపులా కాషాయ జెండాలను కట్టారు.

మరుసటిరోజు రెవెన్యూ అధికారులు తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆక్రమణలు తొలగించడానికి పోలీసులతో బాటు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

కానీ అక్కడ కట్టిన కాషాయ జండాలను చూసి వెనక్కి తగ్గారు. గ్రామస్తులను పిలిచి వాటిని తీసేయ్యమన్నారు. గ్రామంలోని యువకులు, మహిళలు, పురుషులు దాదాపు 300 మంది సంఘటన స్థలానికి చేరుకుని తమ నిరసన తెలియజేశారు. రెవెన్యూ మరియు పోలీసు అధికారులు నచ్చ చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. చివరికి పలమనేరు DSP, మదనపల్లె నుండి RDO, మరియు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులు అక్కడికి చేరుకుని ఆ స్థలాన్ని శ్మశానానికి కేటాయిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.