Newsvideos

పాకిస్తాన్లో బౌద్ధ మత చిహ్నాలు విధ్వంసం

202views

సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు అక్కడి బౌద్ధమత విగ్రహాలను, చిహ్నాలను ధ్వంసం చేసిన సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

తాజాగా ఆశ్చర్యకర రీతిలో పాకిస్తాన్ కూడా తమ దేశంలోని శతాబ్దాల కిందటి బౌద్ధ మత చిహ్నాలను తొలగించింది. గిల్గిత్, బాల్టిస్థాన్ లోని శతాబ్దాల నాటి రాతి చెక్కడాలను, బౌద్ధ మత చిహ్నాలను పాకిస్తాన్ ధ్వంసం చేసింది. హరప్పా నాగరికత కాలం నాటి ఆ చిహ్నాలపై నల్ల రంగును పులమడమే కాకుండా, వాటి స్థానంలో ఇస్లాం మత చిహ్నాలను వేయడాన్ని పాకిస్థాన్ అనుసరిస్తున్న మైనారిటీ మతస్తుల అణచివేత ప్రక్రియలో పరాకాష్టగా కొందరు అభివర్ణిస్తున్నారు.

ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు కల్నల్ VN థాపర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బౌద్ధమతానికి వ్యతిరేకమైన, తమ దేశంలోని బౌద్ధులను తీవ్ర అణచివేతకు, హింసకు గురి చేస్తున్న చైనాను సంతుష్టీకరించడానికే పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా హేయమైన చర్య అని రిపబ్లిక్ టీవీ కన్సల్టెంట్ ఎడిటర్ మేజర్ గౌరవ్ ఆర్య పేర్కొన్నారు. దుర్ఘటన జరిగిన స్థలంలో పాకిస్తాన్ చైనాతో కలిసి ఒక ఆనకట్టను నిర్మించనుండడమే అందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దశాబ్దాలుగా పాకిస్తాన్ తమ దేశంలోని అనేక హిందూ దేవాలయాలను, హిందువులు మరియు మైనారిటీల ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నదని, లక్షలాదిమంది మైనారిటీలను బలి తీసుకుందని, ఇప్పటికీ మైనారిటీలను తీవ్ర అణచివేతకు గురిచేస్తూ ఉన్నదని, అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా ఈ సమస్యపై దృష్టిసారించి పాకిస్తాన్ ను హెచ్చరించడం ద్వారా అక్కడి మైనారిటీలను రక్షించాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Source : Republic TV

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.