సామాన్యులకు మరింత సుళువుగా శ్రీవారి దర్శనం చేయిస్తాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి
గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా రూ.300 దర్శనంతోపాటు వివిధ...
